ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు పీసీసీ కొవిడ్​-19 టాస్క్​ఫోర్స్​ కమిటీ బహిరంగ లేఖ

author img

By

Published : May 3, 2020, 9:05 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​కు పీసీసీ కొవిడ్​-19 టాస్క్​ఫోర్స్​ కమిటీ బహిరంగ లేఖ రాసింది. గల్ఫ్​ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులను క్షేమంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లాక్​డౌన్​ అమలుతో అక్కడి భారతీయుల పరిస్థితి దుర్భరంగా మారిందని కమిటీ ఛైర్మన్​ మర్రి శశిధర్​ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

pcc covid-19 taskforce committee letter to cm kcr
సీఎం కేసీఆర్​కు పీసీసీ కొవిడ్​-19 టాస్క్​ఫోర్స్​ కమిటీ బహిరంగ లేఖ

గల్ఫ్‌ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులను క్షేమంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని పీసీసీ కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆరో బహిరంగ లేఖ రాసింది. గల్ఫ్‌దేశాల్లో 85లక్షల మంది భారతీయులు ఉండగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 15లక్షలు ఉన్నట్లు కమిటీ ఛైర్మన్‌ మర్రి శశిధర్‌ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ ప్రభావం, లాక్​డౌన్‌ అమలుతో అక్కడి భారతీయుల పరిస్థితి దుర్భరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడున్నర లక్షలకుపైగా తెలంగాణ వాసులు లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. వారిలో సగం మంది రాష్ట్రానికి రావడానికి సిద్దంగా ఉన్నారని... తెలంగాణలో సమగ్ర ఎన్నారై విధానాన్ని తీసుకురావాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజల దుస్థితిని దృష్టిలో ఉంచుకుని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ అమలు చేసినప్పుడు...ఇటలీ, చైనా దేశాల్లో చిక్కుకున్న భారతీయులు రోజుల తరబడి వేచి ఉండి రావాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చిక్కుకున్న తెలంగాణ వాసులను క్షేమంగా తీసుకురావడానికి ప్రత్యేకంగా ఇబ్బంది లేని ప్రణాళికను రూపకల్పన చేయాలన్నారు. చిక్కుకుపోయిన భారతీయ వలసదారులను ఉచితంగా వెనక్కి పంపేందుకు కువైట్‌ ముందుకొచ్చినట్లు సమాచారం. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపకల్పన చేసుకుని...తెలంగాణ వాసులను వెనక్కి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ నిబంధనలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.