ETV Bharat / state

కేసీఆర్ చత్తీస్​గఢ్​,రాజస్థాన్​ వస్తారా? : ఉత్తమ్​ సవాల్ - uttam fire on cm kcr

ముఖ్యమంత్రి కేసీఆర్​పై పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​ రెడ్డి ధ్వజమెత్తారు.సీఎం ప్రతిపక్షాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన తెలంగాణ కేసీఆర్​ జాగీర్​ అవుతుందా అంటూ ఘాటుగా స్పందించారు.

pcc chief uttam reaction on cm kcr comments
ముఖ్యమంత్రి కేసీఆర్​పై ఉత్తమ్​ ధ్వజం
author img

By

Published : May 6, 2020, 9:38 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపక్షాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. సీఎం తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ మాట్లాడిన తీరు కాంగ్రెస్ పార్టీని అవమానించినట్లు, తనను వ్యక్తిగతంగా తిట్టినట్లు తాను భావిస్తున్నానని ఉత్తమ్‌ ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా పారాసిట‌మాల్ టాబ్లెట్‌తో కరోనా పోతుందన్న వాళ్లను ఏమనాలని ప్రశ్నించారు. పాస్​పోర్ట్​ల బ్రోకర్ ఎవరో రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని, మార్చిలో కాంట్రాక్టర్లకు నిధులిచ్చి, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాల్లో కోత విధించలేదా అని నిలదీశారు. కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకోడానికి ప్రత్యేక తెలంగాణ వచ్చినట్లు మాట్లాడుతున్నారని... కేసీఆర్, ఆయన కుటుంబం అధికారిక విమానాల్లో కాకుండా ప్రైవేటు విమానాల్లో ప్రయాణాలు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

కేసీఆర్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి... నియంతలా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్​ విమర్శించారు. మరణాల సంఖ్య ఎక్కువగా లేవని... తాను అనని మాటలు అన్నట్లు చెప్పడం హాస్యాస్పదమన్నారు. గవర్నర్‌ని కలిస్తే కేసీఆర్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారన్న ఆయన... గవర్నర్ హక్కులను కూడా కేసీఆర్ అవమానిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు ఇచ్చిన లేఖలను కేసీఆర్ చదివిన తరువాత మాట్లాడాలని సూచించారు. కరోనా వైరస్ దేశమంతా ఒకతీరుగా- తెలంగాణలో మరొక తీరుగా ఉంటుందా అని ప్రశ్నించారు. రైతు బంధు గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. ఏ పంటకు ముందు రైతు బంధు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ ఆయన జీవితకాలంలో ఒక్క మాట నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో రుణాలన్నీ మాఫీ అయ్యాయని...కేసీఆర్​కు దమ్ముంటే చత్తీస్​గఢ్​, రాజస్థాన్ తనతో రావాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోళ్లు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యం చేరుకోలేదని ధ్వజమెత్తారు. మద్యం దుకాణాల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చిన కేసీఆర్ మిగతా విషయాల్లో ఎందుకు పోల్చరని అడిగారు. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన తెలంగాణ కేసీఆర్ జాగీర్​ అవుతుందా అని ప్రశ్నించారు. బత్తాయి ఆరోగ్యానికి మంచిది, విటమిన్-సీ ఉంటుందని అన్న కేసీఆర్.. ఎందుకు బత్తాయి కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు.

ఇవీ చూడండి: ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అనుచితం: కోదండరాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.