లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి వివరిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఈ నెల 4వ తేదీన సోమవారం రోజున గవర్నర్‌ను కలవనున్నట్లు ఆయన తెలిపారు. అఖిలపక్ష బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి పలు విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఆ అంశాలను..కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు తెలియచేసేందుకు ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చినట్లు ఉత్తమ్ వివరించారు. నలుగురున్న కుటుంబంలో 40 రోజులకు రూ.1500 ఆర్థిక సహాయం ఏలా సరిపోతుందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన... దానిని 5వేలకు పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డిమాండ్ చేసినట్లు తెలిపారు. తెల్లకార్డు లేని వారికి కూడా 12కిలోలు బియ్యం ఇవ్వాలని కోరామన్నారు. ఇప్పుడు రాష్ట్ర సర్కారు ఇస్తున్న 12కిలోల బియ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5కిలోలు కూడా ఉన్నట్లు ప్రధాన కార్యదర్శి తెలియచేసినట్లు వివరించారు. అదే విధంగా...రైతు సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
పేస్బుక్ లైవ్ కోసం: క్లిక్ చేయండి
ఇవీ చూడండి: 'ధాన్యం కొనుగోళ్లపై విపక్షాల రాద్ధాంతం సరికాదు'