ETV Bharat / state

'అపాయింట్​మెంట్​ ఇవ్వాలని మోదీకి లేఖ' - తెలంగాణ తాజా వార్తలు

టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ కుమార్ రెడ్డి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లెటర్​ రాశారు. తెలంగాణలో పంటల కొనుగోలు కేంద్రాల ఎత్తివేత, రైతుల పరిస్థితిని వివరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

pcc chief uttam Letter to pm Modi to give appointment
'అపాయింట్​మెంట్​ ఇవ్వాలని మోదీకి లేఖ'
author img

By

Published : Feb 12, 2021, 3:34 AM IST

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ కుమార్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో పంటల కొనుగోలు కేంద్రాల ఎత్తివేత, రైతుల పరిస్థితిపై చర్చించేందుకు అపాయింట్​మెంట్​ ఇవ్వాలని ఉత్తమ్ కోరినట్లు తెలిపారు. పార్లమెంట్​లో కొత్త వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో వ్యవసాయ చట్టాల వల్ల మద్దతు ధరలకు, కొనుగోలు కేంద్రాలకు ఎలాంటి నష్టం ఉండదని ప్రధాని హోదాలో పదే పదే చెప్పారని లేఖలో గుర్తు చేశారు.

రాష్ట్రపతి ప్రసంగంలోనూ కొత్త వ్యవసాయ చట్టాల వల్ల పంటల మద్దతు ధరలకు, కొనుగోలు కేంద్రాలకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సీఎం కేసీఆర్​ ముందుగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినట్లు పేర్కొన్నారు. దిల్లీలో కేసీఆర్ మిమ్మల్ని, హోమ్ మంత్రి షాని కలిసిన తర్వాత.. రాష్ట్రంలో దాదాపు 10 వేల పంటల కొనుగోలు కేంద్రాలను మూసేసినట్లు వెల్లడించారు. అందుకు కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలే కారణమని ఆయన పేర్కొన్నారని అన్నారు.

రాష్ట్రంలో మహిళా సంఘాలు, వ్యయసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ కొనుగోలు కేంద్రాలు మూత పడడానికి కొత్త వ్యవసాయ చట్టాలే కారణమని... పంటలు కొనుగోలు ప్రభుత్వానిది కాదని సీఎం ప్రకటించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్​సభలో ప్రధాని చేసిన ప్రసంగంలో వ్యవసాయ చట్టాల వల్ల రైతుకు మరింత లాభం జరుగుతుందని.. వారికి ఇష్టమున్న దగ్గర ఉత్పత్తులను అమ్ముకోవచ్చని చెప్పారన్నారు.

కానీ సీఎం కేసీఆర్ ఈ చట్టాలను చూపుతూ కొనుగోలు కేంద్రాలను ఎత్తేసి, పంటల కొనుగోలు, మద్దతు ధరల నుంచి ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సవివరంగా వివరించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధాన మంత్రిని అనుమతి కోరినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చూడండి : బల్దియా పీఠమెక్కిన మహిళామణులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.