ETV Bharat / state

'జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలి' - Uttam Kumar Reddy Latest News

హైదరాబాద్ ఇందిరాభవన్​లో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని పార్టీ డివిజన్‌ అధ్యక్షులతో జరిగిన సమావేశం జరిగింది. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్​కుమార్​రెడ్డి పిలుపునిచ్చారు.

Hyderabad Latest News
'జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలి'
author img

By

Published : Nov 4, 2020, 9:46 PM IST

రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డిలు పిలుపునిచ్చారు. ఇందిరాభవన్‌లో ఇవాళ సాయంత్రం మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని పార్టీ డివిజన్‌ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ కుసుమ కుమార్, డీసీసీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్, చల్ల నర్సింహారెడ్డి, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో డివిజన్ల వారీగా పార్టీ స్థితిగతులపై సమీక్షించారు. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల రంగంలోకి దిగాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఉత్తమ్‌, రేవంత్‌లు పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీలో విజయమే లక్ష్యంగా పని చేయాలని, అందుకు పార్టీ ఇంఛార్జీలదే కీలకమని వారు స్పష్టం చేశారు.

ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలకు చెంది రిజర్వేషన్లు ప్రకటించినందున అభ్యర్థి ఎవరైనా అంతా కలిసి కట్టుగా గెలుపుకోసం కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరేళ్లలో హైదరాబాద్ నగరాన్ని సర్వనాశనం చేశారని, డల్లాస్‌గా, ఇస్తాంబుల్‌గా మారుస్తానని.. ఒక్క అభివృద్ధి కూడా చేయలేదని ధ్వజమెత్తారు. వరదలు వచ్చి హైదరాబాద్ పూర్తిగా మునిగిపోయి.. కోట్ల రూపాయల నష్టం వస్తే.. ముష్టిగా ఇంటికో పది వేల ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. మెట్రో రైల్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఐటీ అభివృద్ధి అంతా కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా... ఆ పనిని చిత్తశుద్ధితో చేయాలని నేతలకు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రైతన్న ఆక్రోశం.. దోమ సోకిన పంటకు నిప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.