ETV Bharat / state

ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు: ఉత్తమ్

author img

By

Published : May 14, 2021, 1:10 PM IST

రాష్ట్రంలో కరోనా పరీక్షల కిట్లు లేకపోవడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొవిడ్​పై ఎలాంటి నియంత్రణ లేదని... ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

pcc-chief-uttam-kumar-reddy-on-corona-situations-in-state
ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు: ఉత్తమ్

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా విజృంభిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల కిట్లు లేకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎందుకు చేయట్లేదని ఉత్తమ్ నిలదీశారు.

రాష్ట్రంలో కొవిడ్‌పై ఎలాంటి నియంత్రణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ విజృంభిస్తున్న వేళ ప్రైవేట్ ఆస్పతుల దోపిడీపై చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. 104, 108 సేవలను నిర్వీర్యం చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చలేదన్నారు. ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదని అన్నారు.

ఇదీ చూడండి: మానసిక వైద్యుల సూచనల కోసం.. సీ-19 టాస్క్‌ఫోర్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.