ETV Bharat / state

పారాసిటమాల్​ వేసుకుంటే చాలన్నారు: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి - congress meet latest news

ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఒకటే కొవిడ్​ ఆస్పత్రి ఉందన్నారు. పారాసిటమాల్​ వేసుకుంటే చాలన్న కేసీఆర్​ ఇప్పుడు ఏం చెబుతారోనంటూ ప్రశ్నించారు.

pcc chief uttam kumar reddy fire government on corona issue in hyderabad
పారాసిటమాల్​ వేసుకుంటే చాలన్నారు: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి
author img

By

Published : Jun 27, 2020, 7:12 PM IST

కరోనా వచ్చిన మూడు నెలలు తర్వాత కూడా ఒక్క బెడ్‌ అందుబాటులో లేదనడం సిగ్గు పడాల్సిన అంశమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఒకటే కొవిడ్​ ఆస్పత్రి ఉందన్నారు.

కేంద్రం.. కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి రూ. 50 లక్షల పరిహారం ప్రకటిస్తే తెలంగాణ ప్రభుత్వం దానిని అమలులోకి తీసుకురాలేదన్నారు. కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వైరస్​ బారిన పడిన పేద కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి వచ్చే కేంద్ర బృందాన్ని టి-కాంగ్రెస్ కలిసి కరోనా నివేదిక ఇస్తుందని తెలిపారు.

పారాసిటమాల్​ వేసుకుంటే చాలన్నారు: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

ఇదీ చూడండి: మా ఇంట్లోకి నేను వెళ్లాను..! సమస్యలుంటే న్యాయపరంగా తేల్చుకోవాలి: దాసరి అరుణ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.