దేశవిభజన సమయంలో కూడా ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వలసకార్మికులకు న్యాయం జరగకపోతే తాను ఆమరణ దీక్షకు దిగనున్నట్లు పీసీసీ మాజీ అద్యక్షుడు వి.హనుమంతురావు హెచ్చరించారు. మోదీ, కేసీఆర్‌లు ఇద్దరు వలసకార్మికుల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్‌లకే పరిమితం అవుతున్నారని అన్నారు. వలస కూలీలకు నిల్వ నీడ లేకపోగా, కనీసం తినేందుకు తిండి లేదని ద్వజమెత్తారు.
గాంధీభవన్‌లో ఉదయం నుంచి నిరసన దీక్ష నిర్వహిస్తున్న వి.హనుమంతురావు చేత నిమ్మరసం ఇచ్చి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు దీక్ష విరమింపచేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతురావు అరెస్టు, ఆయనపై పెట్టిన సెక్షన్లు అత్యంత దారుణమన్నారు. వలస కార్మికుల సమస్యపై ఆందోళన, నిరసన చేసిన హనుమంతరావుని అభినందనిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు.
ఇదీ చూడండి : 'ప్రైవేటు వ్యక్తులను ఆదుకునేందుకే కేంద్రం ప్యాకేజీ తెస్తోంది'