ETV Bharat / state

పేటీఎం బ్లాక్ అయిందంటూ.... లక్షల్లో స్వాహా...

లాక్​డౌన్​ను అదునుగా చేసుకొని హైదరాబాద్​లో సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పేటీఎం ఎకౌంట్ బ్లాక్​ అయిందంటూ బ్యాంకు అధికారి పేరుతో ఫోన్​ చేసి... సరికొత్త మోసాలకు తెర దించుతున్నారు.

paytm-cheaters-case-file-in-cyber-crime-station
పేటీఎం బ్లాక్ అయిందంటూ.... లక్షల్లో స్వాహా...
author img

By

Published : Apr 14, 2020, 5:54 AM IST

బేగంపేట్ కుందన్‌బాగ్‌కు చెందిన మాజీ సైనికాధికారి శ్రీనివాస్‌రెడ్డికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశఆరు. పేటీఎం ఎకౌంట్ బ్లాక్​ అయిందంటూ... ఆయన నుంచి బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఓటీపీని తెలుసుకున్నారు. రెండు గంటల్లో లక్షా 85 వేలు విత్‌ డ్రా చేశారు. మోసపోయానని గ్రహించిన శ్రీనివాసరెడ్డి... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదే తరహాలో సంజీవరెడ్డి నగర్‌కు చెందిన హరీష్ ఖాతా నుంచి... లక్షా 32వేల రూపాయలను సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. సికింద్రాబాద్‌కు చెందిన..కాశీనాథ్ అనే వ్యక్తి ఖాతా నుంచి కూడా లక్షా 30 వేల రూపాయలు డ్రా చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఎవరికైనా ఫోన్ వస్తే... అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​లోనూ అవిశ్రాంతంగా పని చేస్తోంది ఆ శాఖ మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.