ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఉదయం జరిగిన పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు. గంగా ప్రక్షాళనకు ఆయన మద్దతు ప్రకటించారు. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలు, సంస్కృతిని పరిరక్షించేందుకు గంగానది కాలుష్యానికి గురికాకుండా తీసుకోవాల్సిన అంశాలపై స్థానికులతో చర్చించారు. గంగా నది ప్రక్షాళన కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్దగా మద్దతు రావడం లేదని... పవన్ ఆ లోటు భర్తీ చేయాలని మాత్రిసదన్ ఆశ్రమ ప్రతినిధులు కోరారు.
ఇవీ చూడండి: హరిద్వార్‌లో నిరాడంబరంగా పవన్ బస