Pawan Kalyan: నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే సమాజంలో సమస్యలు తెలుస్తాయని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల ఆవేదన నుంచే పరిష్కారాలు పుట్టుకొస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జనవాణి కార్యక్రమం ప్రారంభించిన పవన్.. ప్రజా సమస్యలు విన్నారు. నేతలు అధికారం ఉంటేనే సమస్యల పరిష్కారం అంటే కుదరదన్నారు. పదవి లేకపోయినా సమాజంలో ఇబ్బందులపై దృష్టి సారిస్తామన్నారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు ప్రజల నుంచి పవన్ కల్యాణ్ స్వయంగా అర్జీల స్వీకరించనున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదన్న ఆయన.. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
ఇవీ చదవండి: