ఇవీ చదవండి:నేటి నుంచే నామపత్రాల స్వీకరణ
సికింద్రాబాద్ బరిలో జనసేన - MP ELECTIONS
లోక్‌సభ ఎన్నికల్లో జనసేన తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఒక్కొక్కరిగా విడుదల చేస్తోంది. ఇప్పటికే మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించిన పవన్... సికింద్రాబాద్ నుంచి నేమూరి శంకర్ గౌడ్ పేరు ఖరారు చేశారు.
pavankalyan
జనసేన పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. ఏపీలో 32 శాసనసభ స్థానాలకు, 5 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అర్ధరాత్రి 2గంటల సమయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్లను ప్రకటించారు. అందులో ఒకటి తెలంగాణలోని సికింద్రాబాద్ స్థానం కూడా ఉంది. ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా నేమూరి శంకర్ గౌడ్‌కు అవకాశం కల్పించారు. రెండురోజుల క్రితం మల్కాజిగిరి స్థానానికి మహేందర్ రెడ్డి పేరును ప్రకటించారు. మిగతా స్థానాలపై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇవీ చదవండి:నేటి నుంచే నామపత్రాల స్వీకరణ
sample description