సంగీతంతో రోగాలను నయం చేయవచ్చుని సీటీసీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రదీప్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వృత్తిరీత్యా వైద్యుడైన డాక్టర్ వరుణ్‌రాజు రచించి, స్వరపరిచిన దేశభక్తి గీతాన్ని ఆయన ఆవిష్కరించారు.
ప్రపంచంలోనే..
సప్తస్వరాలల్లోని స,మ అనే రెండు స్వరాలతో ఒక గీతాన్ని రూపొందించడం ప్రపంచంలోని ఇది తొలి ప్రయత్నం అని డాక్టర్ వరుణ్‌రాజు అన్నారు. 72వ గణతంత్ర దినోత్సవం కాబట్టి.. ఇందులో 72 అంబియెన్స్ని పలికామన్నారు. యువతలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో దీనిని రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ పాటకు సహకారం అందించిన ఉదయ్ ముద్గల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:జైలు నుంచి విముక్తి- శశికళ విడుదల నేడే