ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జ్వరం బారిన పడిన చిన్నారులతో ఆస్పత్రి వాతావరణం అంతా నిడిపోయింది. సోమవారం కావడం వల్ల రోగుల తాకిడి ఎక్కువగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. నగరంలో ఇటీవల పడిన వర్షాలకు, దోమ కాటుతో అనారోగ్యానికి గురైతున్నాట్లు బాధితులు చెప్పారు. నమోదు కేంద్రాల వద్ద రోగుల సంఖ్య పెరిగిపోతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
ఇదీ చూడండి :నాలుగో రోజుకు చేరిన ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల సమ్మె