Woman Suicide In patancheru after fighting with neighbors : ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలు చేసుకోవడడం ట్రెండ్ అయిపోయింది. అమ్మాయి దక్కలేదనో... ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదనో... పరీక్షల్లో మార్కులు తక్కువచ్చాయనో.. అమ్మాయి ప్రేమించడం లేదనో.. ఇలా చిన్న కారణాలతో అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుని కన్నవాళ్లకు కడుపుకోత మిగుల్చుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అనుకున్నది జరగపోతే.. కావాలనుకుంది దక్కకపోతే.. ఇక తమ జీవితం ఇంతే అనుకుంటూ.. అక్కడే ముగిసిందని భావిస్తూ.. వందేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. చిన్న చిన్న విషయాలను భూతద్ధంలో వేసి పెద్దదిగా చూస్తూ.. ఆయువు తీసుకుంటున్నారు. తమ ఆత్మీయులకు పుట్టెడు దుఃఖాన్ని కలిగిస్తున్నారు.
ఇక కొంతమంది మహిళలు.. భర్త టిక్‌టాక్ వీడియోలు చేయనీయడం లేదని.. మేకప్ వేసుకోనీయడం లేదంటూ.. ఫోన్ ఎక్కువ వాడొద్దన్నాడని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సిల్లీ కారణాలతో తమ జీవితాలను బలి చేసుకోవడమే గాక.. తమను నమ్ముకున్న పిల్లల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులకు తల్లిప్రేమ లేకుండా చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ చిన్న కారణంతో సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
సాధారణంగా ఇంటి పక్కన వారితో అప్పుడప్పుడు చిన్న గొడవ జరగడం కామన్. ఇరుగు పొరుగు అన్నాక.. ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు పొరపచ్చాలు రాకుండా ఉండవు. మాటామాటా అనుకోకుండా ఉండరు. అంతమాత్రానికే పగలు.. ప్రతీకారాలు పెంచుకోవడమూ.. లేదా.. మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకోవడం వంటి అఘాయిత్యాలకు పాల్పడతారా. కానీ ఓ మహిళ మాత్రం పొరుగింటి వారు తిట్టారని.. వాళ్లు తిట్టిన విషయం తెలిసి కూడా భర్త వాళ్లను మందలించలేదని.. అసలు తన బాధను పట్టించుకోవడం లేదని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని రామచంద్రాపురం బొంబాయి కాలనీకి చెందిన శిరీష(25) నాలుగేళ్ల క్రితం పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన గణేష్‌ను ప్రేమించింది. పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి పెళ్లై మూడున్నరేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం సాయంత్రం శిరీష కూతురు పల్లవి పక్కింటి వారితో ఆడుకుంది. కాసేపటికి వారితో చిన్నగా గొడవ పడింది. ఆ విషయంలో పక్కింటి వారు శిరీషను తిట్టారు.
Young Man committed suicide in Secunderabad : ఫోన్ పోయిందని.. ప్రాణం తీసుకున్నాడు
ఈ విషయాన్ని వెంటనే భర్త గణేష్‌కు ఫోన్ చేసి చెప్పింది. రాత్రి ఉద్యోగం అయ్యాక ఇంటికి వచ్చిన గణేష్‌ను పక్కింటివారిని అడగవా అంటూ శిరీష భర్త గణేష్‌తో గొడవ పడింది. నన్ను ఎవరూ తిట్టినా పట్టించుకోవు అంటూ కుంగిపోయింది. ఈ విషయంలో మనస్తాపానికి గురైన శిరీష జూన్ 5వ తేదీన రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు శిరీష మృతిపై అనుమానం ఉందని ఆమె తల్లి లక్ష్మీ పటాన్‌చెరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టామన్నారు.
ఇవీ చదవండి: