పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు ఇకపై ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు ఐడి లాంటి ధ్రువ పత్రాలు అపాయింట్‌మెంట్ రోజున తీసుకురావాల్సిన అవసరం లేదని పాస్‌పోర్ట్ అధికారులు తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెమోరాండమ్ ప్రకారం పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసే సమయంలో.. ‘డిజిలాకర్’లో దరఖాస్తుదారులు భద్రపరచిన ఇ-పత్రాలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
దరఖాస్తుదారులు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు ‘డిజిలాకర్’లో తమ ఖాతాను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. తర్వత “ఫెట్చ్ ఫ్రమ్ డిజిలాకర్” అనే బటన్ను క్లిక్ చేసి అవసరమైన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని వివరించారు. అలా చేయని వారు అపాయింట్‌మెంట్ సమయంలో ధ్రువపత్రాలను నేరుగా కూడా తీసుకెళ్లవచ్చని తెలిపారు.
ఇదీ చూడండి : అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్.. పోలీసుల గాలింపు