Palla Rajeshwar reddy on Rythubandhu: రైతుబంధు పథకం సోమరిపోతులను తయారు చేస్తోందంటూ... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కించపరిచేలా మాట్లాడుతున్నారని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతులను సోమరులను చేస్తున్న పథకమే అయితే... కేంద్రం కూడా అలాంటి కార్యక్రమాన్ని ఎందుకు అమలు చేస్తోందని ప్రశ్నించారు.
రైతుబంధు ద్వారా 50వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. రైతుబంధుతో కొత్త ఒరవడి సృష్టించి... అనేక రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా అమలు చేస్తున్నాయన్నారు. రైతుల్లో ఆనందాన్ని తట్టుకోలేక కొందరు రాజకీయ నాయకులు, కుహనా రైతు సంఘాలు జీర్ణించుకోలేక పోతున్నాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని కొందరు ఆంధ్రనేతల వ్యాపార సంస్థ స్వరాజ్య వేదిక, కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
వానాకాలం వరి కొనుగోళ్ల కోసం తెరాస ఎంపీలు, మంత్రులు పోరాడి ఒప్పిస్తే... భాజపా ఎంపీలు మాత్రం శిఖండి పాత్ర పోషించారని విమర్శించారు. రైతుబంధు వారోత్సవాల్లో రైతులందరూ పాల్గొనాలని కోరారు. ముఖ్యమంత్రిని, మంత్రులను, ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఇక సహించమని.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఒక కొత్త ఒరవడిలో రైతులకు సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం... ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబంగా రాష్ట్రాలు ఇంత మాత్రం మేం ఇవ్వలేం కానీ... ఎంతో కొంత మాత్రం ఇస్తామని ఫాలో కావడం. ఇదే పద్దతిలో ప్రధానమంత్రి కూడా రూ. 2000 చొప్పున 6000 ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం. వీటన్నింటికి మూలం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం. ఆ రైతుబంధు పథకం ద్వారా ఇవాళ రూ. 50వేల కోట్లు... ఒక్క అప్లికేషన్ లేకుండా, అవినీతి లేకుండా రైతుల ఖాతాల్లో జమచేశాం.
-- పల్లా రాజేశ్వర్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు
ఇవీ చూడండి:
Rythu bandhu Celebrations: రాష్ట్రంలో ముందే సంక్రాంతి.. నేటి నుంచి రైతుబంధు సంబురాలు
Rythu Bandhu Funds: యాసంగిలో 66.56 లక్షల మందికి రైతుబంధు సాయం!