ETV Bharat / state

ఏపీలో కలకలం రేపిన ఉగ్రవాది.. - విశాఖ క్రైమ్ న్యూస్

చెన్నై- కోల్​కతా మార్గంలో ఓ పాక్ ఉగ్రవాది పారిపోతున్నాడన్న సమాచారం ఏపీ పోలీసుల్లో కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు... శ్రీకాకుళం జిల్లా కవిటి వద్ద ఉగ్రవాదిని చాకచక్యంగా పట్టుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టుగా సమాచారం. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) పరిధిలో అంశం కావడం వల్ల పోలీసులు సమాచారాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

pak
ఏపీలో కలకలం రేపిన ఉగ్రవాది..
author img

By

Published : Jan 13, 2020, 11:58 PM IST

మారువేషంలో ఏపీలోని ఉత్తరాంధ్ర మీదుగా పారిపోతున్న పాక్ ఉగ్రవాదిని ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారన్న సమాచారం సంచలనం రేపుతోంది. ముంబయి నుంచి కోల్​కతా వెళ్తోన్న ఓ లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తే హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును విచారిస్తున్న అధికారి... అనుమానితుడిని ఉగ్రవాదిగా పసిగట్టారు. సమాచారాన్ని ఎన్​ఐఏకు చేరవేశారు.

ఉగ్రవాది ప్రయాణించిన లారీ సమాచారాన్ని విశాఖ పోలీసులకు అందజేశారు. అప్పటికే లారీ విశాఖ జిల్లా దాటిపోవటంతో.. శ్రీకాకుళం జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. నిన్న అర్ధరాత్రి సోదాలు చేస్తుండగా ఉగ్రవాది ప్రయాణిస్తున్న లారీని పోలీసులు గుర్తించారు.

ఈ వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. నిందితుడిని విశాఖకు తీసుకువచ్చినట్టుగా సమాచారం. అనుమానితుడిని రహస్య ప్రదేశంలో ఎన్​ఐఏ విచారిస్తోందని తెలుస్తోంది. ఈ విషయమై పోలీసు అధికారులు, ఎన్​ఐఏ వర్గాలు ఇంతవరకు ఎటువంటి ధ్రువీకరించలేదు.

ఇదీ చదవండి : ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని సీఎంల నిర్ణయం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.