ETV Bharat / state

ఆంధ్ర మత్స్యకారులను భారత్​కు అప్పగించిన పాక్

author img

By

Published : Jan 6, 2020, 8:16 PM IST

దాయాది దేశంలో బందీలుగా శిక్ష అనుభవించిన ఆంధ్రా జాలర్లకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్​ వారిని భారత్​కు అప్పగించింది. వారంతా రేపటిలోగా స్వగ్రామాలకు చేరుకోనున్నారు.

fisher men released
చెర నుంచి ఇంటికి

ఆంధ్ర మత్స్యకారులను భారత్​కు అప్పగించిన పాక్

ఏడాదికి పైగా పాకిస్థాన్‌ జైల్లో మగ్గిన తెలుగు మత్స్యకారులు భారత్‌లో అడుగుపెట్టారు. 2018లో వేటకు వెళ్లి పొరపాటున పాక్ జలాల్లోకి ప్రవేశించిన 20 మంది ఆంధ్రప్రదేశ్​కు చెందిన జాలర్లను... ఆ దేశ సైన్యం బంధించి జైల్లో పెట్టింది. కేంద్ర ప్రభుత్వ చర్చలతో వీరిని ఎట్టకేలకు విడుదల చేసింది. పాక్ నుంచి విడుదలైన మత్స్యకారులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ వాఘా సరిహద్దుకు వెళ్లారు. వారంతా రేపటిలోగా స్వగ్రామాలకు చేరుకోనున్నారు.

ఎలా చిక్కారు?

పొట్టకూటి కోసం గుజరాత్​కు వలస వెళ్లిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు... వీరావల్‌లో చేపలవ్యాపారుల వద్ద పనిచేసేవారు. 2018 నవంబర్‌లో చేపల వేటకు వెళ్లిన 20 మంది పొరపాటున వీరావల్ తీరం నుంచి పాక్‌ జలాల్లోకి ప్రవేశించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారంతా... అనుకోకుండా పాక్‌కు బందీలుగా మారి అక్కడి లంధి జైలులోశిక్ష అనుభవించారు. 2008 ఒప్పందం ప్రకారం భారత్, పాక్ ఏటా మత్స్యకారులు, ఖైదీలను విడుదల చేస్తూ వస్తున్నాయి. ఈసారి భారత విదేశాంగ చర్చలూ ఫలించి.. లంధి జైలు నుంచి 20 మందిని పాక్ విడుదల చేసింది.

విడుదలైన వారు వీరే

పాక్ విడుదల చేసిన తెలుగువారిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన... ఎస్.కిశోర్‌, నికరందాస్‌ ధనరాజ్, గరమత్తి, ఎం.రాంబాబు, ఎస్.అప్పారావు, జీ.రామారావు, బాడి అప్పన్న, ఎం.గురువులు, నక్కా అప్పన్న, నక్కా నర్సింగ్, వి.శామ్యూల్, వి.ఎర్రయ్య, డి.సురాయి నారాయణన్, కందా మణి, కోరాడ వెంకటేశ్, శేరాడ కళ్యాణ్, కేశం రాజు, భైరవుడు, సన్యాసిరావు, సుమంత్‌ ఉన్నారు.

ఇదీ చూడండి: యాదాద్రిలో ఘనంగా.. లక్ష పుష్పార్చన కార్యక్రమం

Intro:Body:

dummy for fisher men

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.