కరోనా వైరస్ రాష్ట్రాన్ని భయకంపితులను చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నీ ఈ నెల 31వరకు మూసేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం అధికారులు ఉస్మానియా, వాటి అనుబంధ కళాశాలలను బంద్ చేశారు.
వసతి గృహాల్లో విద్యుత్, నీటి సరఫరాను కూడా నిలిపివేశారు. దీనివల్ల అసహనానికి గురైన విద్యార్థులు ఓయూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరిస్తూ ధర్నా చేపట్టినందుకు ఓయూ పోలీసులు సుమోటోగా తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: ఆ ఐటీ సంస్థ ఆఫీస్ కొబ్బరి తోటలోనే!