ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: ఆ ఐటీ సంస్థ ఆఫీస్​ కొబ్బరి తోటలోనే!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతోంది. ఐటీ సిటీ బెంగళూరుకూ కరోనా భయం పట్టుకుంది. వైరస్ ముప్పును తప్పించుకునేందుకు నగరానికి చెందిన ఓ అంకుర సంస్థ వినూత్న ఆలోచన చేసింది. తమ కార్యాలయాన్ని కొబ్బరి తోటకు మార్చింది.

corona
కరోనా ఎఫెక్ట్​: ఆ ఐటీ సంస్థ ఆఫీస్​ కొబ్బరి తోటలోనే!
author img

By

Published : Mar 18, 2020, 1:33 PM IST

Updated : Mar 18, 2020, 3:22 PM IST

కరోనా ఎఫెక్ట్​: ఆ ఐటీ సంస్థ ఆఫీస్​ కొబ్బరి తోటలోనే!

కరోనా భయాలతో టెక్ దిగ్గజాలు మొదలుకొని చిన్న సంస్థల వరకు ఉద్యోగులకు సెలవులు ఇవ్వడమో.. లేదా ఇంటి నుంచే పనిచేసే 'వర్క్​ ఫ్రం హోమ్'​ సౌలభ్యమో కల్పిస్తున్నాయి. అయితే ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తే ఉత్పాదకత తగ్గుతుందని సంస్థల్లో ఓ వైపు ఆందోళన కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా భయం నుంచి విముక్తి పొంది.. మరింత మెరుగైన పనితీరు కనబరిచే దిశగా నిర్ణయం తీసుకుంది ఓ అంకుర సంస్థ. తమ కార్యరంగాన్ని కాంక్రీట్ జంగల్ నుంచి వ్యవసాయ క్షేత్రానికి మార్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యోగులతో పని చేయిస్తోంది.

స్పామ్ ఈ-మెయిళ్లకు చెక్​పెట్టి తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా గత నాలుగేళ్లుగా 'ఇన్​స్టా క్లీన్' అనే అంకుర సంస్థ పనిచేస్తోంది. ఇన్​స్టా క్లీన్​ సీఈఓ అరవింద్​ రాజ్ తమిళనాడు తెనీ జిల్లా హనుమంతపట్టి వాసి. అక్కడ వారి కుటుంబానికి ఓ కొబ్బరితోట ఉంది. కరోనా ముప్పు నేపథ్యంలో బెంగళూరులోని సంస్థ కార్యాలయాన్ని తన సొంతూరుకు మార్చారు అరవింద్.

"బెంగళూరుకు కరోనా భయం పట్టుకుంది. పలు సంస్థలు వర్క్​ ఫ్రం హోం సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. నేనైతే పనిచేసుకునేందుకు వర్క్ ఫ్రం ఫాం విధానాన్ని అవలంబిస్తున్నాను. బెంగళూరులో పనివేళలు చాలా కచ్చితంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచెయ్యడం వల్ల ఉద్యోగులు వర్క్​ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు."

-అరవింద్ రాజ్, ఇన్​స్టా క్లీన్ యాప్ సీఈఓ

ఎనిమిది మంది ఉద్యోగుల ఇన్​స్టా క్లీన్​ బృందం ఎయిర్ కండీషన్డ్ గదులు, రివాల్వింగ్ ఛైర్లలో కూర్చుని పనులు సాగించేదన్నారు సంస్థ హెచ్​ఆర్ హెడ్ ఆండ్రియా ఫెర్నాండెజ్ . ప్రస్తుతం పశ్చిమ కనుమల అందాలు వీక్షిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.

"నా పేరు ఆండ్రియా ఫెర్నాండెజ్. నేను ఇన్​స్టా క్లీన్ యాప్​లో హెచ్​ ఆర్​ మేనేజర్​ను. మేం వర్క్ ఫ్రం ఫాం విధానాన్ని అవలంబిస్తున్నాం. కరోనా వైరస్ దేశంలో క్రమంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. వర్క్​ ఫ్రం హోం విధానంలో రెండు, మూడు రోజులైతే బాగుంటుంది కానీ.. తర్వాత ఉద్యోగుల ఉత్పాదకత తగ్గిపోతుంది. ఈ కారణంగా మా సీఈఓ అరవింద్ వ్యవసాయ క్షేత్రంలో మకాం వేసి పనిచేసే ప్రతిపాదన చేశారు. కలిసి ఉండి పనిచేసుకోవచ్చన్నారు."

-ఆండ్రియా ఫెర్నాండెజ్, హెచ్​ఆర్ మేనేజర్

నాలుగు గోడల మధ్య పనిచెయ్యడం యాంత్రికంగా ఉంటుందని, ఆహ్లాదకర వాతావరణంలో పనిచెయ్యడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఇన్​స్టా బృందంలోని మరో సభ్యుడు ఇంతియాజ్​ షేక్.

ఇది చూడండి: కరోనా: మాస్క్​ ఎవరు పెట్టుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Last Updated : Mar 18, 2020, 3:22 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.