ETV Bharat / state

'ఓయూలో పరీక్షలు వాయిదా వేయలేం' - పరీక్షలు యథాతథం

హైదరాబాద్​లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో రేపటి నుంచి జరగనున్న పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అయితే కరోనా కారణంగా హాజరు కాలేని విద్యార్థుల కోసం మళ్లీ పరీక్షలు నిర్వహించాలని.. వాటిలో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్​గానే పరిగణిస్తామని వెల్లడించారు.

osmania university exams cannot be postponed
'ఓయూలో పరీక్షలు వాయిదా వేయలేం'
author img

By

Published : Mar 19, 2021, 9:03 PM IST

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో రేపటి నుంచి జరగనున్న పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి తెలిపారు. అయితే కరోనా కారణంగా హాజరు కాలేని విద్యార్థుల కోసం మళ్లీ పరీక్షలు నిర్వహించాలని.. వాటిలో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్​గానే పరిగణిస్తామని పేర్కొన్నారు.

ఓయూ క్యాంపస్​లోని మహిళల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిందని.. మిగతా విద్యార్థినులకు పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రిజిస్ట్రార్ తెలిపారు. అయితే కరోనా కారణంగా రేపటి నుంచి జరగనున్న మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల డిమాండ్లను అంగీకరించలేమని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఓయూతోపాటు జిల్లాల్లోని సుమారు ఎనిమిది వేల మంది పరీక్షలు రాయనున్నందున వాయిదా వేయలేమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : '25 ఎకరాల్లో వనసంపద దగ్ధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.