రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వబోమని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఉంటుందని.. కోహెడ మార్కెట్ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయని వెల్లడించారు. చికిత్స అనంతరం 12 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 18 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కోహెడలో గంటకు 83.52 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చిందన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ.. రైతులకు భరోసా ఇవ్వాలని కోరారు. మార్కెట్‌కి వచ్చే ప్రతి ఉత్పత్తిపై ఇన్సూరెన్సు ఉందని రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ స్పష్టం చేశారు. కోహెడ పరిసర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లను తీసుకొని మామిడి రైతులకు.. క్రయ విక్రయాలకు కేటాయిస్తున్నామని తెలిపారు.
ఇవీ చూడండి: నేడు కాంగ్రెస్ 'రైతు సంక్షేమ దీక్ష'