ప్రకృతి, సేంద్రియ పంటలను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో రైతునేస్తం ఫౌండేషన్, కర్షక సేవా కేంద్రం సంయుక్తంగా సేంద్రియ ఉత్పత్తుల మేళా-2021 నిర్వహించనున్నాయి. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మార్చి 29 నుంచి 31వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు తమ పంటలు, ఉత్పత్తులను విక్రయించే సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.
సేంద్రియ వ్యవసాయం ఆవశ్యకత, సాగులో యువత, మిద్దెతోటల పెంపకం తదితర అంశాలపై ఆయా రంగాల నిపుణులతో అవగాహన కల్పించనున్నారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా... అందరికీ సహజ ఆహారం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో రైతు నేస్తం ఫౌండేషన్ పని చేస్తోంది. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానాలతో పర్యావరణం బాగుపడాలని వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: రేపట్నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేత