Opposition Parties Campaign Against BRS Party : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్‌లు తమదైన శైలిలో ముందుకెళ్తున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు సంధిస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేుపీకు మద్దతు ఇవ్వడంపై పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతురావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీతో దోస్తీపట్ల పవన్ వైఖరి మార్చుకుంటే బాగుంటుందని సూచించారు. సామాన్య ప్రజలకు తిండి, మంచి బట్టలు, ఇల్లు అవసరమని కాంగ్రెస్ నేత మాజీ కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ గాంధీ భవన్‌లో వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ దీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజలంతా కాంగ్రెస్ వైపు వస్తున్నారన్న ఆయన.. సోషల్ మీడియాను, నాయకులను మేనేజ్ చేయచ్చు కానీ... ప్రజలను మేనేజ్ చేయలేరన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని.. భారీ మెజారిటీతో గెలుస్తానని కాంగ్రెస్ అభ్యర్థి ఆదం సంతోష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
Congress Leaders Slams BRS Party : బీఆర్ఎస్ ముసుగులో కొందరు కాంగ్రెస్ నేతలు నీలం మధుపై విష ప్రచారం చేస్తున్నారని ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ మండిపడ్డారు. టికెట్‌ను ఆయనకు ఇవ్వడంతో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. కాగా.. పటాన్‌చెరు బీ ఫామ్ విషయంలో ఇప్పటికీ సందిగ్దత ఎడతెగకుండా ఉండడం గమనార్హం.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. పదేళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. అధికారంలోకి వస్తే తామేం చేస్తామో మేనిఫెస్టోని విడమరిచి చెప్పే యత్నం చేయడం సభికులను ఆలోచింపజేసింది. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్, సీపీఐ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి ఎన్నికలలో తాము సంయుక్తంగా ప్రచారం చేస్తున్నామని.. కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.
తుది ఘట్టానికి నామపత్రాల పర్వం - నేడు గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్
Congress Election Campaign in Telangana 2023 : నాగార్జునసాగర్‌లో తక్కువ ధరలకే నివాస గృహాలను, స్థలాలను ఇప్పించింది నేనేనంటూ.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి సీసీరోడ్డకు, బీటీ రోడ్డుకు తేడా తెలియదని మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ మండలంలో కలియతిరిగారు. ఖమ్మం జిల్లాలోని ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ను వీడీ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైనట్లు సమాచారం.
బీఆర్ఎస్ నేతలకు తన గురించి మాట్లాడే అర్హత లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా అవినీతి సంపాదనలో మునిగిపోయారని.. ఒక్క కేసు కూడా లేని నన్ను విమర్శించే స్థాయి వారికెక్కడిదని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాక్లుర్ మండలానికి చెందిన పలు గ్రామాల బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
బీజేపీలో అసమ్మతి జ్వాల - అసంతృప్తులను బుజ్జగించే పనిలో రాష్ట్ర నాయకత్వం
ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవచేస్తున్న అధిష్ఠానం తనకు కాకుండా ఇతర జిల్లా వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల నిర్ణయం మేరకే భవిష్యత్ కార్యాచరణ ఉంటుదని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రంలోని గుళ్లు, గుళ్ల భూములను మాయం చేస్తున్నారని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ జాతీయ నేత, మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ మాటలు తుపాకీ రాముడుతో సమానమంటూ ఎద్దేవా చేశారు.
చట్టసభలో మహిళలకు దక్కని అవకాశం - తెలంగాణ ఎన్నికలో మహిళలకు ఎన్ని సీట్లో తెలుసా?
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే- ధరణిని రద్దు చేసి మెరుగైన పోర్టల్‌ను తీసుకొస్తాం"