ETV Bharat / state

బీబీఏ పట్టభద్రులకు కూడా బీఈడీ చేసే అవకాశం

ఇక నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ హోంసైన్స్, బీసీఏ, బీబీఎం, బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్‌తో పాటు బీబీఏ పట్టభద్రులు కూడా బీఈడీ ప్రవేశపరీక్ష రాయవచ్చు. ఈ మేరకు బీఈడీ ప్రవేశపరీక్ష అర్హతలు, ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది.

Opportunity to do BEd even for BBA graduates
బీఈడీ మార్గదర్శకాలు
author img

By

Published : Apr 12, 2021, 5:27 PM IST

బీఈడీ ప్రవేశపరీక్ష అర్హతలు, ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిఫారసుల మేరకు బీఈడీ ప్రవేశపరీక్ష నిబంధనలను సవరించింది. ఇక నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ హోంసైన్స్, బీసీఏ, బీబీఎం, బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్‌తో పాటు బీబీఏ పట్టభద్రులు కూడా బీఈడీ ప్రవేశపరీక్ష రాయవచ్చు. 50శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.

ఒకే ప్రవేశపరీక్ష...

ఇతర కోర్సుల్లాగానే ఇంజినీరింగ్ పట్టభద్రుల ఉత్తీర్ణతా మార్కుల శాతాన్ని కూడా 50శాతానికి తగ్గించారు. బీఈడీ అన్ని మెథడాలజీల కోర్సుల కోసం ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో సీట్ల శాతం, ఆయా మెథడాలజీలకు అర్హతా సబ్జెక్టులను కూడా ఖరారు చేశారు. గణితానికి 25శాతం, ఫిజికల్ సైన్సెస్, బయాలజీకి 30శాతం సీట్లు ఉంటాయి. ఫిజికల్ సైన్సెస్, బయాలజీలో కనీసం పదిశాతం చొప్పున గరిష్టంగా 20శాతానికి మించకుండా సీట్లు ఉంటాయి.

విద్యాశాఖ ఉత్తర్వులు...

సోషల్ సైన్సెస్, ఆంగ్లం, ఓరియంటల్ లాంగ్వేజెస్​కు 45శాతం సీట్లు ఉంటాయి. ఆంగ్లం, ఓరియంటల్ లాంగ్వేజెస్​లో కనీసం ఐదు శాతం చొప్పున రెండింటికి కలిపి గరిష్టంగా 15శాతం వరకు సీట్లు ఉంటాయి. గణితం ఓ సబ్జెక్టుగా బీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్ పూర్తి చేసిన వారితో పాటు ఇంటర్‌లో గణితం చదివిన బీసీఏ పట్టభద్రులు మాథ్స్ మెథడాలజీకి అర్హులు.

అన్ని మెథడాలజీలకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో అర్హతా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించనున్నారు. ఈ మేరకు బీఈడీ ప్రవేశపరీక్ష నిబంధనల్లో సవరణలు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి: రాగల 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.