ETV Bharat / state

Toss: అందరూ ఉత్తీర్ణులే... ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు - open inter exams cancelled

ఓపెన్ స్కూల్​ (Open School)లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (Toss) గుడ్​న్యూస్ చెప్పింది. టాస్​లో పది, ఇంటర్ విద్యార్థులందరినీ ఉత్తీర్ణుల్ని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Open
ఓపెన్
author img

By

Published : Jun 29, 2021, 3:25 PM IST

ఓపెన్ స్కూల్ (Open School) పదో తరగతి, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం.. టాస్​ (Toss)లో పది, ఇంటర్ విద్యార్థులందరినీ ఉత్తీర్ణుల్ని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు నిర్ణయంతో ఓపెన్ స్కూల్ పదో తరగతిలో 63, 581 మంది, ఇంటర్​లో 47,392 మంది పాసయ్యారు. కరోనా తీవ్రత కారణంగా పరీక్షలు లేకుండా ఉత్తీర్ణులను చేసే విధివిధానాలు ఖరారు చేసేందుకు ఏడుగురు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.

కమిటీ సిఫార్సుల మేరకు జీవో జారీ చేసింది. విద్యార్థులందరినీ 35 మార్కులతో ఉత్తీర్ణుల్ని చేయాలని నిర్ణయించింది. వివిధ ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలకు కనీస అర్హత మార్కులు ఉన్నట్లుగా పరిగణించాలని పేర్కొంది. మార్కులతో సంతృప్తి చెందని వారు టాస్ పరీక్ష నిర్వహించినప్పుడు... ఇంప్రూవ్​మెంట్ నిబంధనల మేరకు రాసుకోవచ్చని తెలిపింది. ఫలితాలను ప్రకటించాలని టాస్ డైరెక్టర్​ను విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రవేశ పరీక్షల షెడ్యూల్​లో మార్పులు...

తెలంగాణలో నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో విద్యా శాఖ మార్పులు చేసింది. కరోనాతో వాయిదా పడిన ప్రవేశ పరీక్షల సమయాన్ని రీషెడ్యూల్‌ చేసింది. జులైలో ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉండగా ఆగస్టులోనే అన్ని రకాల ప్రవేశ పరీక్షలు పూర్తయ్యేలా తేదీలను ఖరారు చేసింది. జులైలో డిగ్రీ, పీజీ ఆఖరి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని విశ్వవిద్యాలయాల ఉపకులపతులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

జులై 1 నుంచి ఆన్​లైన్ బోధన...

జులై 1 నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభించనున్నట్లు గతంలో ప్రకటించిన ప్రభుత్వం... కరోనా తీవ్రత, హైకోర్టు ప్రశ్నలతో వెనక్కి తగ్గింది. కొన్నాళ్ల పాటు ఆన్​లైన్ బోధనే కొనసాగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు ఆదేశించారు. పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ సహా కేజీ నుంచి పీజీ వరకు అన్ని తరగతులు ఆన్​లైన్ పాఠాలు ప్రారంభించనున్నారు. జులై 1 నుంచి మూడో తరగతి నుంచి పీజీ వరకు ఆన్​లైన్ బోధన మొదలు పెట్టనున్నారు. కేజీ నుంచి రెండో తరగతి వరకు ఆగస్టు 1 నుంచి ఆన్​లైన్​ బోధన ప్రారంభం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.