ETV Bharat / state

ఆస్తి పన్ను చెల్లించేందుకు వారం మాత్రమే మిగిలుంది: జీహెచ్ఎంసీ

గ్రేటర్ హైదరాబాద్​లో 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. బకాయిలను సిటిజన్ సర్వీస్ సెంటర్లలో, మీసేవా, ఆన్​లైన్, మై జీహెచ్ఎంసీ యాప్​లో గాని చెల్లించవచ్చు.

ఆస్తి పన్ను చెల్లించేందుకు వారం మాత్రమే మిగిలుంది: జీహెచ్ఎంసీ
ఆస్తి పన్ను చెల్లించేందుకు వారం మాత్రమే మిగిలుంది: జీహెచ్ఎంసీ
author img

By

Published : Mar 24, 2021, 7:43 PM IST

గ్రేటర్ హైదరాబాద్​లో 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీని 90 శాతం వరకు మాఫీ చేసే వన్ టైం సెటిల్మెంట్ పథకం ప్రకారం బకాయిలు చెల్లించేందుకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 31లోపు చెల్లించి వడ్డీ రాయితీ ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ కోరింది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.1,900 కోట్ల ఆస్తి పన్ను సేకరించాలని లక్ష్యాన్ని విధించుకోగా... నేటి వరకు రూ.1,484.10 కోట్లు జీహెచ్ఎంసీ సేకరించింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మిగిలిన ఆస్తిపన్ను బకాయిలను పొందేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ప్రచార, చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. ఇందుకోసం సంక్షిప్త సందేశాలను ఉపయోగించుకుంటోంది. బకాయిలను సిటిజన్ సర్వీస్ సెంటర్లలో, మీసేవా, ఆన్​లైన్, మై జీహెచ్ఎంసీ యాప్​లో గాని చెల్లించవచ్చు.

ఇదీ చూడండి: పాలేరు నుంచి బరిలో దిగుతా.. ఖమ్మం నేతలతో షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.