ETV Bharat / state

ప్రవాస భారతీయ మహిళల రక్షణ కోసం సిద్ధంగా ఉన్నాం: ఏడీజీపీ స్వాతి లక్రా - తెలంగాణ తాజా వార్తలు

భర్త నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న ప్రవాస భారతీయ మహిళలకు అన్ని రకాలుగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మహిళల భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా అన్నారు. ప్రవాస భారతీయ మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక విభాగం ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

women safety wing telangana
ప్రవాస భారతీయ మహిళల రక్షణ కోసం సిద్ధంగా ఉన్నాం: ఏడీజీపీ స్వాతి లక్రా
author img

By

Published : Jul 1, 2020, 4:43 AM IST

ప్రవాస భారతీయ మహిళల రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని మహిళల భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా అన్నారు. ప్రవాస భారతీయ మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఆధ్వర్యంలో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. అమెరికా, బ్రిటన్​కు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు బాధిత ప్రవాస భారతీయ మహిళలు పాల్గొన్నారు. సుమారు 80 మంది ప్రవాస భారతీయ మహిళలు గృహహింస ఎదుర్కొంటున్నట్టు మహిళా భద్రత విభాగం దృష్టికి తీసుకొచ్చారు. వీళ్ళందరికీ తగిన న్యాయ సాయం అందించే విధంగా చూస్తామని అదనపు డీజీపీ తెలిపారు.

విదేశాల్లో ఉంటున్న మహిళలు గృహ హింస ఎదుర్కొంటే ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగా సాయం చేసే విధంగా స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నారు. ఇప్పటివకు దాదాపు వందమంది ప్రవాస భారతీయ మహిళలు మహిళా భద్రతా విభాగంలో ఫిర్యాదు చేశారు. బాధిత మహిళలు ఏ విధంగా మహిళా భద్రత విభాగాన్ని సంప్రదించాలని సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని 17 మహిళా పోలీస్ స్టేషన్లకు చెందిన ఇన్​స్పెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. న్యాయ వాదులు కూడా పాల్గొని పలు సలహాలు సూచనలు ఇచ్చారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 945 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.