Online Trading Frauds in Hyderabad : ఇటీవల ఓ బాధితుడికి మీరు ట్రేడింగ్ చేస్తున్నారా అంటూ ఫోన్ వచ్చింది. అవునని చెప్పడంతో తాము ట్రేడింగ్ టిప్స్ ఇస్తామని.. షేర్లు కొనుగోలులో సహాయం చేస్తామని చెప్పి పలు మార్లు అతని టిప్స్ ఇచ్చారు. అనంతరం మంచి లాభాలు వచ్చేలా ట్రేడింగ్ చేస్తామని నమ్మించి బాధితుడి నుంచి డీమ్యాట్ ఖాతా వివారాలు తీసుకున్నారు. తర్వాత డీమ్యాట్ ఖాతాకు అనుసంధానంగా ఉన్న బాధితుడి ఖాతాలో కాకుండా తాము చెప్పిన ఖాతాలోకి డబ్బులు పంపాలని అతనికి చెప్పారు. దీంతో బాధితుడు రూ.2లక్షల 60వేలు బదిలీ చేశాడు. అనంతరం స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు, ఏపీలోని అన్నమయ్యలో జిల్లా పీలేరులోని ఓ కాల్ సెంటర్‌పై దాడులు నిర్వహించారు.
Online Trading Tips Frauds in Hyderabad : ప్రధాన నిందితుడు సాయి శరణ్ కుమార్ రెడ్డి సహా మరో నలుగురిని అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడు అన్నమయ్య జిల్లాకు చెందిన సాయి శరణ్ కుమర్ రెడ్డి బీటెక్ పూర్తి చేశాడు. షేర్ మార్కెట్ పై ఉన్న ఆశక్తితో మొదట్లో పలువురికి సలహాలు ఇచ్చాడు. అనంతరం పీలేరులో ఎలాంటి అనుమతులు లేకుండా ట్రేడింగ్ సలహాలు ఇచ్చే ఓ కంపనీని తెరిచాడు. తన స్నేహితులు, సహచరులైన వారిని కంపనీలో పలు అధికారులుగా నియమించాడు.
"బాధితుడికి టెలికాలర్ నుంచి కాల్ వచ్చింది. వారు మీరు కొంచెం డబ్బులు ఇస్తే ట్రేడింగ్ టిప్స్ చెప్తాం. ఎక్కువ లాభాలు రావాలంటే మేము చెప్పిన ఖాతాలో డబ్బులు వేయాలి అనేసరికి బాధితుడు రూ.2 లక్షల 60 వేలు వాళ్లు చెప్పిన ఖాతాలో వేశారు. తర్వాత బాధితుడు కాల్ చేస్తే సమాధానం ఇవ్వడం మానేశారు. నిందితులు ఎలాంటి అనుమతులు లేకుండా కాల్‌సెంటర్‌ని నడుపుతున్నారు." - స్నేహా మెహ్రా, సైబర్ క్రైం డీసీపీ, హైదరాబాద్
టిప్స్ ఇస్తామంటూ దోచేస్తూ : ట్రేడింగ్ చేసే వారి డేటాను సేకరించి వాటి ద్వారా ఫోన్లు చేసేందుకు కంపనీలో 38 మంది లేడి టెలికాలర్స్‌ను సైతం నియమించుకున్నాడు. పోలీసుల దర్యాప్తులో ఇప్పటి వరకూ 140 మందిని మోసం చేసి రూ.1.8 కోట్లను కాజేసినట్లు తేలింది. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 31ల్యాప్ టాప్‌లు, 6 చరవాణిలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రేడింగ్‌లో సలహాలు చెబుతామంటే తీసుకోండి కానీ వారికి ఖాతా వివరాలు, డబ్బులు పంపవద్దని పోలీసులు చెబుతున్నారు. మరో వైపు ట్రేడింగ్ చేస్తున్న వారి డేటా వారికి ఎలా వెళ్లిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: