ETV Bharat / state

పల్లెల్లో మొదలైన డిజిటల్‌ బోధన

రాష్ట్రంలోని విద్యార్థులకు మంగళవారం వారం నుంచి ఆన్​లైన్​ బోధన ప్రారంభమైంది. దూరదర్శన్​, టీశాట్​కు చెందిన ఛానెళ్లు పాఠాలను ప్రసారం చేశాయి. ఉపాధ్యాయులు పలు గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి డిజిటల్‌ పాఠాల ప్రసారాలపై తల్లిదండ్రులు, పిల్లలకు అవగాహన కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 3 నుంచి 10వ తరగతి విద్యార్థుల్లో 85.42 శాతం మంది మొదటి రోజు వివిధ మార్గాల ద్వారా పాఠాలను వినియోగించుకున్నారు.

online classes in telangana
పల్లెల్లో మొదలైన డిజిటల్‌ బోధన
author img

By

Published : Sep 2, 2020, 7:32 AM IST

రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో మంగళవారం నుంచి టీవీ పాఠాల సందడి మొదలైంది. విద్యాశాఖ.. దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌కు చెందిన విద్య ఛానెళ్ల ద్వారా ముందుగా రికార్డు చేసిన 3 నుంచి 10 తరగతుల వారికి పాఠాలను ప్రసారం చేసింది. దూరదర్శన్‌లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, విద్య ఛానెల్‌లో ఉదయం 10 నుంచి 12 గంటలు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠాలను ప్రసారం చేశారు.

ఆగస్టు 27వ తేదీ నుంచి బడులకు వెళ్తున్న ఉపాధ్యాయులు మంగళవారం పలు చోట్ల గ్రామాల్లో తిరుగుతూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి డిజిటల్‌ పాఠాల ప్రసారాలపై తల్లిదండ్రులు, పిల్లలకు అవగాహన కల్పించారు. స్మార్ట్‌ఫోన్లు ఉన్న వారికి టీశాట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి ఇచ్చారు. డీడీ పాఠాలను యూట్యూబ్‌లోనూ చూడొచ్చని సూచించారు.

కొన్నిచోట్ల డీడీ, టీశాట్‌ ఛానెళ్లపై ఉపాధ్యాయుల్లో పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల విద్యార్థులకు వివరంగా చెప్పలేకపోయారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం దూరదర్శన్‌ కేంద్రానికి వెళ్లి ప్రసారాలను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉండగా...మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతితో వారంపాటు సంతాప దినాలు ప్రకటించడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది.

పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఆయా జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు పాఠాల ప్రసారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు తదితరులు పాఠాల ప్రసారాలను పరిశీలించారు.

ఆంగ్లంలో కావాలి సర్‌...

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకూ పాఠ్యాంశాలు ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటాయి. టీవీల ద్వారా పాఠాలు తెలుగులో ప్రసారం అవుతుండటం వల్ల తమకు ఆంగ్లంలో కావాలని ఆ విద్యార్థులు అడుగుతున్నట్లు మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు తెలిపారు. ఆ పాఠశాలల్లో 10-15 గ్రామాల విద్యార్థులు చదువుతుంటారు. దాంతో మంగళవారం ఒక్కో ఉపాధ్యాయుడు ఒక్కో గ్రామానికి వెళ్లి విద్యార్థులను కలిసి అవగాహన కల్పించారు.

85.42% వినియోగించుకున్నారు: మంత్రి

రాష్ట్రవ్యాప్తంగా 3 నుంచి 10వ తరగతి విద్యార్థుల్లో 85.42 శాతం మంది మొదటి రోజు వివిధ మార్గాల ద్వారా పాఠాలు వినియోగించుకున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 16,43,309 మంది విద్యార్థుల్లో డీడీ, టీశాట్‌ ద్వారా 10,72,851 మంది వీక్షించారు. స్మార్ట్‌ ఫోన్లు/ల్యాప్‌టాప్‌లు/కంప్యూటర్ల ద్వారా 1,91,768 మంది, గ్రామ పంచాయతీల్లో 78,696 మంది, ఇతర మార్గాల ద్వారా 60,515 మంది..మొత్తం 14,03,830 మంది పాఠాలు వినియోగించుకున్నారని మంత్రి తెలిపారు. వర్క్‌ షీట్లను 1,42,979 మంది, టీశాట్‌ యాప్‌ను 11,56,658 మంది వినియోగించుకున్నారని వివరించారు.

విద్యార్థులకు కొత్త అభ్యాస అనుభవం: కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టీశాట్‌ ద్వారా పాఠశాలల పిల్లలకు కొత్త అభ్యాస అనుభవం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు మంగళవారం ట్విటర్‌లో తెలిపారు. మంగళవారం నుంచి విద్యాఛానల్‌ 3 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలను ప్రసారం చేస్తోందని పేర్కొన్నారు. టీశాట్‌ యాప్‌లో 4 లక్షల వినియోగదారులు, యూట్యూబ్‌ ఛానల్‌లో 4.3 లక్షల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు.

శౌచాలయాన్ని కడిగిన ఉపాధ్యాయురాలు

ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బంది(స్కావెంజర్‌)ని తొలగించడంతో మరుగుదొడ్డిని ఓ ఉపాధ్యాయురాలే శుభ్రం చేయాల్సిన పరిస్థితి సిద్ధిపేట జిల్లాలో ఏర్పడింది. గత కొన్ని నెలలుగా పాఠశాలలు మూతపడటం వల్ల శౌచాలయాలు అధ్వానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలను శుభ్రం చేయాలని జిల్లా ఉన్నతాధికారులు పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ క్రమంలో చేర్యాల మండలం వీరన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంచాయతీ సిబ్బంది వచ్చి చెత్త ఊడ్చారు. శౌచాలయాలను శుభ్రం చేయాలని ఉపాధ్యాయులు కోరినా అది తమ పని కాదని వెళ్లిపోయారు. చేసేదేమిలేక ఉపాధ్యాయిని పి.వెంకటరమణ స్వయంగా నీళ్లు తీసుకెళ్లి మరుగుదొడ్డిని శుభ్రపరిచారు. ఈ ఫొటోను ఆమె మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, సబితారెడ్డికి ట్విటర్‌లో పంపారు.

ఇవీ చూడండి: అన్​లాక్​-4 ఉత్తర్వులు.. ఈ నెల 7 నుంచి మెట్రో సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.