ETV Bharat / state

తీరుమారిన శిక్షణ... ఆన్‌లైన్‌లో పోటీ పరీక్షల తర్ఫీదు! - corona virus latest news

కరోనా నేపథ్యంలో హైదరాబాద్​ నగరంలో పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు ఖాళీ అయిపోయాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ కేంద్రాల నిర్వాహకులు కూడా నిరుద్యోగులకు ఆన్​లైన్​లో శిక్షణ ఇస్తున్నారు. వర్చువల్​ విధానంలో సివిల్స్​, గ్రూప్స్​ పరీక్షల కోసం తర్ఫీదునిస్తున్నారు. లైవ్​, రికార్డు చేసిన వీడియోలతో శిక్షణ ఇస్తున్నారు.

online classes for competitive exams training
ఆన్‌లైన్‌లో పోటీ పరీక్షల శిక్షణ!
author img

By

Published : Jun 30, 2020, 10:07 AM IST

ఆన్‌లైన్‌లో పోటీ పరీక్షల శిక్షణ!
ఆన్‌లైన్‌ తరగతులకు హాజరైన అభ్యర్థులు

రీంనగర్‌కు చెందిన రమేష్‌ ఈ మార్చి వరకు అశోక్‌నగర్‌లోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. అదే నెలలో లాక్‌డౌన్‌ వల్ల శిక్షణ సంస్థలు మూతపడ్డాయి. తిరిగి సొంతూరు వెళ్లిపోయాడు. ఇంట్లోనే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు వింటున్నాడు.

కరోనా నేపథ్యంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా నగరంలో పోటీ పరీక్షల శిక్షణను కోచింగ్‌ సెంటర్లు మార్చుకుంటున్నాయి. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ కేంద్రాలు మూతపడ్డాయి. ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. పోటీ పరీక్షలకు నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు లాక్‌డౌన్‌ వేళ ప్రత్యామ్నాయాలపై సంస్థల నిర్వాహకులు దృష్టి పెట్టారు. ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు. వర్చువల్‌ విధానంలో సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షలకు తర్ఫీదునిస్తున్నారు. కొన్ని ప్రత్యేక స్టూడియోలూ ఏర్పాటు చేసుకున్నాయి. స్టూడియోల్లో ఫ్యాకల్టీతో పాఠాలు రికార్డు చేయించి పంపిస్తున్నాయి. నేరుగా లైవ్‌లోనూ పాఠాలు బోధిస్తున్నాయి. గూగుల్‌ మీట్స్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్జ్‌ తదితర యాప్‌ల సాయం తీసుకుంటున్నాయి. ఎక్కువగా యూట్యూబ్‌ లైవ్‌ వీడియోల ద్వారా శిక్షణ సాగుతోంది. లైవ్‌లో సందేహాలూ నివృత్తి చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రాలు పంపితే.. సమాధాన పత్రాలు అప్‌లోడ్‌ చేస్తున్నారు నిరుద్యోగులు. ఫ్యాకల్టీలు దిద్ది వాట్సాప్‌ ద్వారా ఎవరివి వారికి పంపిస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో పోటీ పరీక్షల శిక్షణ!
అశోక్‌నగర్‌లో మూతపడిన స్టడీ సర్కిళ్లు

ఫీజులు తక్కువే

ఆన్‌లైన్‌ కోచింగ్‌లో ఫీజులు తక్కువేనని విద్యార్థులు చెబుతున్నారు. గ్రూప్స్‌ కోచింగ్‌ కోసం రూ.20 వేల-రూ.30 వేలు ఖర్చు చేస్తే ఆన్‌లైన్‌లో ఏడాదికి రూ.6 వేల సబ్‌స్క్రిప్షన్‌లో కొన్ని వేల తరగతులకు సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉంటున్నాయంటున్నారు. కావాల్సిన మెటీరియల్‌ను వెతికి చదువుకోగలిగితే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం సులువేనని నిపుణులు చెబుతున్నారు.

బోసిపోతున్న ప్రాంతాలు

సివిల్స్‌, గ్రూప్స్‌, పోలీస్‌(ఎస్‌ఐ, కానిస్టేబుల్‌), వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ తదితర పరీక్షలు రాసేందుకు పెద్దసంఖ్యలో విద్యార్థులు నగరంలోని కోచింగ్‌ సెంటర్లలో తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివి అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కేపీహెచ్‌బీ, అమీర్‌పేటలో 1200 వరకు కేంద్రాలున్నాయి. ఇక్కడ ఏటా 5-6 లక్షల మంది నిరుద్యోగులు శిక్షణ తీసుకుంటారని అంచనా. వీరు స్థానిక వసతిగృహాల్లో ఉండేవారు. వేసవిలో వార్షిక పరీక్షలు ముగిశాక ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించేవారు. దాదాపు మూడున్నర నెలలుగా రద్దీ లేక ఆయా శిక్షణ సంస్థలు బోసిపోయి కన్పిస్తున్నాయి. ఆయా సంస్థలన్నీ మూతపడి దర్శనమిస్తున్నాయి.

ఆన్‌లైన్‌ శిక్షణకు డిమాండ్‌

- ప్రభాకర్‌, శిక్షకులు

లాక్‌డౌన్‌ కారణంగా శిక్షణ సంస్థల్లో కోచింగ్‌ ఇచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే బోధన సాగుతోంది. యూట్యూబ్‌ లైవ్‌ వీడియోలు, ఇతర కాన్ఫరెన్సింగ్‌ యాప్‌ల సాయంతో బోధిస్తున్నాం. విద్యార్థులు తక్కువ మొత్తంలో ఫీజు చెల్లించి శిక్షణ పొందుతున్నారు.

ఇవీ చూడండి: కరోనా వస్తే.. ఆస్పత్రికి వెళ్లడం కంటే ఇల్లే మేలట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.