తెలంగాణ సంగీత నాటక అకాడమీ, అభినయ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో వర్చువల్ యూత్ డాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఆ ప్రదర్శనకు రోజురోజుకీ ప్రేక్షకుల నుంచి ఆదరణ పెరుగుతోంది. తొలి జాతీయస్థాయి వర్చువల్ డాన్స్ ఫెస్టివల్ ఈనెల 28 వరకు జరగనుంది.
దాదాపు 800 మంది కళాకారులు పాల్గొంటున్నారని అభినయ థియేటర్ ట్రస్ట్ నిర్వాహకులు అభినయ శ్రీనివాస్ తెలిపారు. ఎనిమిదో రోజున పలువురు కళాకారులు భారతీయ సంప్రదాయబద్ధమైన కూచిపూడి, భరతనాట్యంతోపాటు వివిధ అంశాలను ప్రదర్శించి వీక్షకులను మెప్పించారు.
ఇదీ చూడండి : నాన్నను రెండు వారాల తర్వాత కలిశాను: ఎస్పీ చరణ్