పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయుగుండం గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతూ... విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 330 కి.మీ. దూరంలో, కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 370 కి.మీ. దూరంలో, నరసాపురానికి తూర్పు ఆగ్నేయంగా 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత గంటకు 50- 75 కి.మీ. వేగంతో ఉండొచ్చని తెలిపారు.
రాగల 12 గంటలలో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో నర్సాపూర్, విశాఖపట్నం మధ్య కాకినాడకు దగ్గరలో అక్టోబర్ 13వ తేదీ తెల్లవారుజామున తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది.
ఇదీ చదవండీ... కొత్త వ్యవసాయ చట్టాల పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ