ETV Bharat / state

కొనసాగుతున్న సచివాలయం తరలింపు ప్రక్రియ - BRK Bhawan

సచివాసయం తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం బూర్గుల రామకృష్ణారావు భవన్​ను సిద్ధం చేస్తున్నారు. తరలింపు నేపథ్యంలో పోలీసు అధికారులు బీఆర్కే భవన్​ను పరిశీలించారు.

BRK Bhawan
author img

By

Published : Jul 9, 2019, 1:42 PM IST

సచివాలయ కార్యాలయాల తరలింపు కోసం బూర్గుల రామకృష్ణారావు భవన్​ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్కే భవన్​లో ఉన్న కార్యాలయాలన్నింటినీ ఖాళీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ కార్యాలయల తరలింపునకు ఏర్పాట్లు చేశారు. ఏడో అంతస్తులో ఉన్న సాంకేతిక విద్యాశాఖ కార్యాలయాన్ని మాసబ్ ట్యాంక్​కు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. మిగతా కార్యాలయాల తరలింపుపై అధికారులు దృష్టి సారించారు.

తొమ్మిదో అంతస్తులో సీఎం కార్యాలయం

బీఆర్కే భవన్​లోని తొమ్మిదో అంతస్తులోకి ముఖ్యమంత్రి, సీఎస్ కార్యాలయాలాను తరలించే అవకాశం ఉంది. ఏడో అంతస్తులోకి సాధారణ పరిపాలన శాఖను తరలించనున్నారు. కొన్ని మినహా అన్ని శాఖలను బీఆర్కే భవన్​కే తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తరలింపు నేపథ్యంలో పోలీస్ అధికారులు బీఆర్కే భవన్​ను పరిశీలించారు.

ఉన్నతాధికారుల పరిశీలన

శాంతి భద్రతలు, ఎస్పీఎఫ్, ఐఎస్​డబ్ల్యూ విభాగాల అధికారులు సంబంధిత అంశాలపై చర్చించారు. రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ కూడా బీఆర్కే భవన్​ను పరిశీలించారు. అక్కడ ఉన్న వసతులు, ఇతర సదుపాయాలను తెలుసుకున్నారు.

ఇదీ చూడండి: తెరాసకు సోమారపు సత్యనారాయణ రాజీనామా

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.