హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ లక్ష్మినారాయణ కాలనీకి చెందిన ప్రవీణ్ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్ష రాసేందుకు స్నేహితుడి ద్విచక్రవాహనం తీసుకుని బయలుదేరాడు. రామంతాపూర్ పెద్ద చెరువు వద్దకు రాగానే ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తు ద్విచక్రవాహనం అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడిపోయాడు. విషయం గమనించిన స్థానికులు పక్కనే ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తలిరించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన ప్రవీణ్ ప్రమాదంలో మృతి చెందాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి