గ్రేటర్ హైదరాబాద్ లో 2019- 20 ఆర్థిక ఏడాది వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీని 90 శాతం వరకు మాఫీ చేసే వన్ టైం సెటిల్మెంట్ పథకం కింద ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు మరో 5 రోజులు మాత్రమే మిగిలిఉంది. ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ రాయితీనిస్తూ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది యజమానుల వరకు తమ ఆస్తిపన్ను బకాయిలను చెల్లించారు.
గ్రేటర్ హైదరాబాద్ లో ఇంకా తమ ఆస్తిపన్ను బకాయిలను చెల్లించని వారికి వెంటనే ఆస్తి పన్ను బకాయిలను చెల్లించాలని వారి సెల్ ఫోన్ లకు సంక్షిప్త సమాచారాన్ని జీహెచ్ఎంసీ పంపిస్తోంది. ఆస్తి పన్ను బకాయిలను జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లలో గాని, మీసేవా లోగాని, ఆన్ లైన్, మైజీహెచ్ఎంసీ యాప్ లో గాని చెల్లించవచ్చని జీహెచ్ఎంసీ వెల్లడించింది.
ఇదీ చూడండి: ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం