దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని రిమాండ్‌కి తరలించే సమయంలో చర్లపల్లి జైల్ వద్ద పోలీసుల కళ్లు గప్పి ఉదయం తప్పించుకున్నాడు. వాట్సాప్‌లో అశ్లీల చిత్రాలు, అసభ్యకర సందేశాలు పంపుతూ మహిళా న్యాయవాదిని వేధిస్తున్న క్రమంలో అతనిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మలక్‌పేటలోని తన స్నేహితుని ఇంట్లో తలదాచుకున్న ప్రసాద్‌ను రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో మహిళల వేధింపుల కేసులో జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోలేదు.. అదే పంథా కొనసాగిస్తూ మరోసారి పోలీసులకు దోరికిపోయాడు. దుర్గాప్రసాద్ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చూడండి : పీఎస్‌కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు