స్థానికులు ఆపేందుకు వెళ్లగా... వాళ్లని దూషిస్తూ లక్ష్మిని ఇంకా ఎక్కువగా కొట్టాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. బాధితురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
తాగిన మత్తులో దాడి - MAHILA PAI DADI
విధి నిర్వహణలో ఉన్న జీహెచ్ఎంసీ కార్మికురాలిపై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి దాడికి దిగాడు.
తాగిన మత్తులో దాడి
హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తాగిన మైకంలో జాఫర్ అనే వ్యక్తి ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఉదయం రామ్‌దేవ్ గూడాలో జీహెచ్ఎంసీ కార్మికురాలులక్ష్మితో జాఫర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
స్థానికులు ఆపేందుకు వెళ్లగా... వాళ్లని దూషిస్తూ లక్ష్మిని ఇంకా ఎక్కువగా కొట్టాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. బాధితురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
sample description