ఇవీ చూడండి:వనపర్తిలో వైద్యుడు లేని ప్రభుత్వాసుపత్రి
హైదరాబాద్లో కోటి రూపాయలు సీజ్ - 1 crore
ఎన్నికల సందర్భంగా పెద్ద మొత్తంలో నగదు, మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. నిన్న రాత్రి జరిపిన తనిఖీల్లో దిల్సుఖ్నగర్లో కోటి రూపాయల నగదు దొరికింది.
నగదు సీజ్ చేసిన పోలీసులు
ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ దిల్సుఖ్నగర్ రాజీవ్చౌక్లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. మలక్పేట్ గంజ్ మార్కెట్ నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఓ వ్యాపారికి చెందినదిగా గుర్తించారు. పూర్తి విచారణ కోసం చైతన్యపురి పోలీసులు ఐటీ శాఖ అధికారులకు డబ్బు అప్పగించనున్నారు. ఎన్నికల కోడ్ సమయంలో 50 వేల రూపాయలకు మించి తీసుకెళ్లరాదని తెలిపారు. అంతకు మించి ఉంటే అందుకు తగ్గ ఆధారాలు ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి:వనపర్తిలో వైద్యుడు లేని ప్రభుత్వాసుపత్రి
sample description
Last Updated : Mar 27, 2019, 11:54 AM IST