Onam celebrations in Tirupati: విభిన్న సంస్కృతుల నిలయం..ప్రకృతి అందాలకు ఆలవాలమైన కేరళ రాష్ట్రం. తమదైన సంస్కృతీ సంప్రదాయాలతో పాటుగా వేషధారణలతో ఆకట్టుకునే కేరళీయులకు అతిపెద్ద పండుగ ఓనం. తిరుపతిలో స్ధిరపడ్డ కేరళవాసులు ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని బైరాగిపట్టెడలోని సీపీఐ ఫంక్షన్ హాల్ వేదికగా తిరుపతి కేరళ సమాజం, ఆలిండియా మళయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓనం వేడుకలు కన్నుల పండువగా జరిగింది.కేరళకే ప్రత్యేకమైన సంస్కృతీ సంప్రదాయాలకు ఈ కార్యక్రమంలో వేదికగా నిలిచాయి.
ఓనం వేడుకలను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మేయర్ శిరిషా ప్రారంభించారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు కేరళను స్వర్ణయుగంలా పరిపాలించిన బలిచక్రవర్తి.. తిరిగి తమను కలుసుకునేందుకు పాతాళం నుంచి తిరిగివచ్చిన రోజుగా ఓనం పండుగను భావించి సంబరంలా చేసుకుంటామని కేరళ వాసులు తెలిపారు.ప్రతి సంవత్సరం ఈ పండుగను నిర్వహించుకుంటున్నామని,.. కరోనా అనంతరం ఓనం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిసారి ఓనం అయిన రెండు నెలల అనంతరం మళ్లీ ఆలిండియా మళయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు.
ఇవీ చదవండి