ETV Bharat / state

సోషల్ మీడియా ద్వారా బహిరంగ సభ: చాడ - open house with left parties on june 2nd

తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో... రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. జూన్​ 2న సోషల్ మీడియా ద్వారా ఆన్​లైన్​లో వామపక్షాలతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

on june 2nd open house with left parties on social media
సోషల్ మీడియా ద్వారా బహిరంగ సభ: చాడ
author img

By

Published : Jun 1, 2020, 7:35 PM IST

నియంత్రిత వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి... రైతులను బెదిరిస్తున్న తరుణంలో రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. జూన్ 2న రాష్ట్ర 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని జాతీయ జెండా ఆవిష్కరించి జరుపుకోవాలని నిర్ణయించారు.

జూన్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో.... ప్రభుత్వ వైఫల్యాలపై ప్రస్తావిస్తూ... సోషల్ మీడియా ద్వారా ఆన్​లైన్​లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

కేరళ రాష్ట్రం మాదిరిగా... అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారస్తులకు కేంద్రం రూ. 7,500 ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేస్తూ... జూన్ 4వ నిరసన తెలపనున్నట్లు చెప్పారు. విద్యుత్ సవరణ బిల్లు -2020లో పూర్తిగా ప్రైవేటుపరం చేయడానికి అనేక అనుకూల అంశాలను అందులో పొందుపర్చబడ్డాయని విమర్శించారు.

కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి కేటాయించిన నికర వాటాను వినియోగించుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలని డిమాండ్ చేస్తూ... జూన్ 6వ నల్లగొండ, సూర్యాపేట, జూన్ -7న ఖమ్మం, జూన్8న మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తాం. - చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఇదీ చూడండి:"విద్యుత్‌ సవరణ బిల్లు'తో తీరని నష్టం"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.