ETV Bharat / state

ఏపీలో రెండు పూటలా బడులు.. కార్యాచరణ సిద్ధం! - ఈనెల18 నుంచి రెండు పూటలా బడులు

కొవిడ్‌-19 కారణంగా ప్రస్తుతం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు నిర్వహిస్తున్న తరగతులను ఈ నెల 18 నుంచి రెండు పూటలా నిర్వహించాలని ఏపీ పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది. ఇందుకు జిల్లాల వారీగా 100 రోజుల కార్యాచరణను అధికారులు తయారు చేస్తున్నారు.

ఈ నెల 18 నుంచి ఏపీలో రెండు పూటలా బడులు?
ఈ నెల 18 నుంచి ఏపీలో రెండు పూటలా బడులు?
author img

By

Published : Jan 10, 2021, 5:29 PM IST

ఏపీ పాఠశాలల్లో తరగతులను ఈ నెల 18 నుంచి రెండు పూటలా నిర్వహించాలని ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. కొవిడ్‌-19 కారణంగా ప్రస్తుతం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకే బడి నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే విడివిడిగా తరగతులకు మధ్యాహ్న భోజనాన్ని అందించి పాఠశాలను ముగిస్తున్నారు. ఇక నుంచి కరోనాకు ముందు నిర్వహించినట్లే యథావిధిగా బడులను కొనసాగించాలని ఆలోచిస్తున్నారు.

రాష్ట్రంలో గత నవంబరు 2 నుంచి 9, 10 తరగతులను ప్రారంభించగా.. గత డిసెంబరు 14 నుంచి 7, 8 తరగతులను ప్రారంభించారు. సంక్రాంతి తర్వాత 18 నుంచి ఆరు, ఇంటరు మొదటి ఏడాది తరగతులను ప్రారంభించనున్నారు. పదో తరగతి విద్యార్థులను పబ్లిక్‌ పరీక్షలకు సమాయత్తం చేసేలా బోధన సాగించాలని భావిస్తున్నారు. ఇందుకు జిల్లాల వారీగా 100 రోజుల కార్యాచరణ తయారు చేస్తున్నారు. 1-5 తరగతుల నిర్వహణపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇదీ చూడండి: 'కుల సంఘాలు ఐక్యంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.