Telangana Omicron Cases: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 12 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 55కు చేరుకుంది. ఇప్పటివరకు ఒమిక్రాన్ బారిన పడిన 10 మంది బాధితులు కోలుకున్నారు.
ఇవాళ వెలుగుచూసిన కేసుల్లో 10 మంది నాన్రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారేనని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు కాంటాక్ట్ ఒమిక్రాన్ బాధితులని తెలిపారు.
182 కరోనా కేసులు
మరోవైపు, రాష్ట్రంలో గడిచిన 24గంటల వ్యవధిలో 182 కొవిడ్ కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. 181మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,417 క్రియాశీల కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.90శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.59శాతంగా ఉందని ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది.
ఇవీ చదవండి: