సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి భవాని నగర్లో గల కాళీ దుర్గ భవానిమాత ఆలయ పునః ప్రతిష్ట 8వ వార్షికోత్సవం నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులు లేకుండా.. హంగు ఆర్భాటాలు లేకుండా ఈ సారి వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పరిమిత సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో భౌతిక దూరం పాటిస్తూ.. గణపతి హోమం, అమ్మవారికి అభిషేకం, 11 కలశాల పూజ, అమ్మవారికి అలంకరణ వంటి కార్యక్రమాలు చేశారు.
కరోనా మహమ్మారి పూర్తినా నశించి.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్టు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తెలిపారు. వచ్చే సంవత్సరం అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు వైభవంగా జరుపుతామని తెలిపారు. భక్తులు, ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ.. జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు.
ఇదీ చూడండి : పిల్లల అమ్మకాలకు ఏజెంట్ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి