ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో సచివాలయ ఉద్యోగులకు అధికారులు మెమోలు జారీ చేశారు. రాత్రి షిప్టుల్లో విధులు నిర్వహించ లేదని సుమారు 150 మంది ఉద్యోగులకు పురపాలక కమిషనర్ రాధ.. వాట్సాప్ ద్వారా మెమోలు పంపారు. శిక్షణ విధుల్లో ఉన్న తమకు మెమోలు రావడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఎలా పని చేయాలంటూ గగ్గోలు పెడుతున్నారు.
ఇదీ చూడండి: కొంతమందికే సీఎం అయితే... పేరుపెట్టే పిలుస్తా'