ETV Bharat / state

దుబ్బాక దెబ్బ నుంచి కేటీఆర్ ఇంకా కోలుకోనట్టున్నారు: లక్ష్మణ్ - కేటీఆర్​పై లక్ష్మణ్ ఆరోపణలు

జీహెచ్​ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అధికార తెరాసపై ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శలు ఎక్కుపెట్టారు. విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చిన ఘనత తెరాస, ఎంఐఎంలకు దక్కుతుందని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు వెల్లడించారు.

దుబ్బాక దెబ్బ నుంచి కేటీఆర్ ఇంకా కోలుకోనట్టుంది: లక్ష్మణ్

author img

By

Published : Nov 21, 2020, 9:56 PM IST

దుబ్బాక ఉపఎన్నిక ఓటమి నుంచి పురపాలక మంత్రి కేటీఆర్ ఇంకా కోలుకోలేదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భాగ్యనగరం డ్రగ్‌ మాఫియా అడ్డాగా మారిందన్నారు. చిన్నారులు సైతం డ్రగ్స్ ప్రభావానికి గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.

తెరాస అంటే...

హైదరాబాద్‌లో స్వచ్ఛమైన నీటి సరఫరా లేదని... అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ ప్రణాళికలు ఇస్తే బుట్ట దాఖలు చేశారని ఆరోపించారు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా భూ కబ్జాలేనని... తెరాస అంటే తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా మార్చేశారని దుయ్యబట్టారు.

మేము కేంద్రానికి ఇస్తున్నది ఎంత? మాకు కేంద్రం ఇస్తోంది ఎంత అని ప్రశ్నిస్తున్నారు? విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చిన ఖ్యాతి తెరాస, ఎంఐఎంలకే చెందుతుంది. ఆరున్నర సంవత్సరాల్లో కేవలం 630 మందికి మాత్రమే రెండు పడకల ఇళ్లు ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి గ్రాఫిక్స్​కు మాత్రమే పరిమితమైంది. ఎన్నికల కోసమే ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. మెట్రో రైల్​ ప్రారంభానికి మేయర్​కు ఆహ్వానం లేకపోవడం అవమానించటమే.

- లక్ష్మణ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

బీసీలకు పెద్దపీట...

గ్రేటర్​లో బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు. బీసీలకు 50పైగా స్థానాలు... నాలుగు జనరల్ స్థానాల్లో ఎస్సీలకు అవకాశమిచ్చినట్లు చెప్పుకొచ్చారు. డిసెంబరు 4న అసలైన ప్రగతి నివేదికను తెరాసకు ప్రజలు ఇవ్వబోతున్నారని వెల్లడించారు. తెరాస ప్రగతి నివేదికలో పచ్చి అబద్ధాలున్నాయని విమర్శించారు.

దుబ్బాక దెబ్బ నుంచి కేటీఆర్ ఇంకా కోలుకోనట్టున్నారు: లక్ష్మణ్

ఇదీ చూడండి: జీహెచ్​ఎంసీలో తెరాస హామీలపై రేపు ఛార్జ్​షీట్​ విడుదల: కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.