Nims hospital nursing staff protest: వైద్యశాల్లో డాక్టర్లు ఎంత ముఖ్యమో అదే విధంగా నర్సులు అంతే ముఖ్యం. వారు లేకపోతే రోగులు ఇబ్బందులు పడక తప్పదు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో నర్స్‌ల ధర్నాతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎలక్టివ్ శస్త్రచికిత్సలను నిలిపివేసి అత్యవసర శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నట్టు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. విధులకు సరిగా హాజరుకావటం లేదంటూ ఇటీవల నిమ్స్‌లో ముగ్గురు నర్సింగ్ సిబ్బందికి డైరెక్టర్ బీరప్ప మెమో జారీ చేశారు. దీంతో ఎలాంటి సమ్మె నోటీస్ ఇవ్వకుండానే నర్సింగ్ సిబ్బంది ఈ ఉదయం నుంచి విధులు బహిష్కరించారు.
2500 మందికి 800 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు: ఫలితంగా నిమ్స్ ఆస్పత్రిలో వివిధ విభాగాల్లోనే రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నర్సులతో చర్చలకు డైరెక్టర్ బీరప్ప ముగ్గురు సభ్యుల కమిటీ వేసినా చర్చలకు నర్సింగ్ సిబ్బంది సుముఖత చూపకపోవటం గమనార్హం. మెమోలు తక్షణమే వెనక్కి తీసుకుంటే తప్ప చర్చలకు సిద్ధంగా లేమని నర్సింగ్ సిబ్బింది తేల్చి చెప్పేశారు. విధులకు సైతం హాజరు కాబోమని స్పష్టం చేశారు. నిమ్స్‌లో 2500 మంది సిబ్బంది అవసరం ఉండగా కేవలం 800 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో పనిభారం ఎక్కువగా ఉంటోందని ఆరోపించారు.
"ఒకరు, ఇద్దరికి మెమోలు ఇచ్చినంత మాత్రాన నర్సింగ్ సిబ్బంది మొత్తం ధర్నా చేయడం ఎంత వరకు మంచిది. ప్రస్తుతం ఆసుపత్రిలో 1400 మంది రోగులు ఉన్నారు. 95 శాతం ఐసీయూలు నిండిపోయి ఉన్నాయి. ఒక అడ్మినిస్ట్రేట్గా వ్యక్తే తప్పు చేస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి. పైగా నర్సింగ్ సిబ్బంది మొత్తం వారికి సహాయంగా ఉండడం చాలా బాధాకరం. ఎవరికైనా డిమాండ్స్ ఉంటే ఓ పద్దతి ఉంది. ముందుగా అప్లికేషన్ ఇవ్వాలి. అలానే EPFO విషయంలో మంత్రితో సహా అందరు మంచి భావనతోనే ఉన్నారు. ఒక్కసారిగా నర్సింగ్ సిబ్బంది నిరసన తెలిజేయడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. వారిపైన ఆధారపడిన రోగుల పరిస్థితి ఏమవుతుంది. ఎలాంటి ప్రశ్నలు అయిన అడిగేందు నేను ఏ సమయంలోనైనా సిద్దంగా ఉంటాను. మీరు ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు." - డాక్టర్ బీరప్ప , నిమ్స్ డైరెక్టర్
ఇవీ చదవండి: