ETV Bharat / state

హైదరాబాద్​లో నర్సరీ మేళా.. ఉత్సాహంగా పాల్గొంటున్న అంకుర కేంద్రాలు - నర్సరీ మేళా

Nursery Mela in Hyderabad: ఉత్సాహపూరిత వాతావరణం నడుమ జాతీయ వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన సాగుతోంది. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భాగ్యనగరం వేదికగా హుస్సేన్‌సాగర్ తీరంలో ఐదు రోజులపాటు జరగనున్న 13వ గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల నుంచి పేరెన్నిక గన్న నర్సరీలు, అంకుర కేంద్రాలు, కంపెనీలు.. తమ స్టాళ్లు ఏర్పాటు చేసి ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాయి. ఈ నర్సరీ మేళాకు సందర్శకులు పోటెత్తున్నారు.

Nursery Mela in Hyderabad
హైదరాబాద్​లో నర్సరీ మేళా
author img

By

Published : Jan 27, 2023, 9:50 AM IST

హైదరాబాద్​లో 13వ నర్సరీ మేళా

Nursery Mela in Hyderabad: హైదరాబాద్‌ పీవీ మార్గ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో.. అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన 2023 కోలాహలం నడుమ సాగుతోంది. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ సంస్థ ఆధ్వర్యంలో 5 రోజులపాటు జరగనున్న 13వ గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి పేరెన్నిక గన్న ప్రముఖ కంపెనీలు, నర్సరీలు, అంకుర కేంద్రాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మహిళా సంఘాలు ఆధ్వర్యంలో 150 పైగా స్టాళ్లు కొలువుతీరాయి.

వాతావరణ మార్పుల నేపథ్యంలో మారుతున్న ఆహారపు అలవాట్లు.. అభిరుచులతోపాటు నగర సేద్యం పట్ల వ్యాపకం పెరుగుతున్న దృష్ట్యా.. అన్ని వర్గాలకు ఉపయోగరమైన విత్తనాలు, మొక్కలు, టిష్యూ కల్చర్, సీడ్లింగ్స్, బొన్సాయో మొక్కలు, హైడ్రోపొనిక్ టెక్నాలజీ, ల్యాండ్ స్కేపింగ్ టెక్నాలజీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి ప్రేమికుల కోసమే ఏర్పాటు చేసిన గ్రాండ్ నర్సరీ మేళా.. చాలా బాగుందని, ఎన్నో రకాల మొక్కలు, అవసరమైన విజ్ఞానం లభ్యమవుతోందని సందర్శకులు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన పంటల సాగు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో పలు నర్సరీలు తమ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు, బుకింగ్‌లు చేపట్టాయి. టిష్యూ కల్చర్‌, సీడ్లింగ్‌లో భాగంగా అరటి, బొప్పాయి, మామిడి, సపోట వంటి మొక్కలు కొనుగోలుకు రైతులు ఆసక్తి ప్రదర్శించారు. అదే సమయంలో హైదరాబాద్ నగరవాసులు సైతం తమ ఇళ్ల పక్కన, ఫాం హౌసులు, కొత్తగా కొనుగోలు చేసిన ప్లాట్లలో నాటేందుకు.. ప్రత్యేక శ్రద్ధ చూపించి కొనుగోలు చేశారు.

వాతావరణ మార్పులకు తోడు పెరుగుతున్న జనాభా, నగరీకరణ నేపథ్యంలో ఉన్న సహజ వనరులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు అనేక కొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సారి ప్రత్యేకంగా ఖర్జూరం సాగును అందుబాటులోకి తీసుకువచ్చారు. చిన్నారులను విశేషంగా ఆకట్టుకునే.. అబ్బురపరిచే గ్రూట్స్ క్యారెక్టర్స్ వంటివి మినీయేచర్స్ ఇటీవల ప్రాచుర్యంలోకి వస్తుండటంతో.. అవి ఫ్రీబడ్జెట్‌లో సరఫరా చేస్తున్నాయి.

నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో.. ఈ గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభోత్సవానికి ముందు నుంచే సందర్శకులు విచ్చేసి తమకు ఇష్టమైనవి కొనుగోలు చేస్తున్నారు. ఇక తొలి రోజు నుంచే తెలుగు రాష్ట్రాలు సహా.. హైదరాబాద్ జంట నగరాల ఔత్సాహికులు, ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు ఈ మేళాకు పోటెత్తుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.