నిత్యం రోగులతో ఉండే గాంధీ ఆస్పత్రి ఒక్కసారిగా బోసిపోయింది. 3 రోజులుగా ఆస్పత్రిలో రోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కరోనా వైరస్ అనుమానితులకు ఇక్కడ చికిత్స అందిస్తుండడం వల్ల... సాధారణ రోగులు రావడానికి జంకుతున్నారు.
అత్యవసర సేవల కోసం మినహా మిగిలిన వారు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఎప్పడూ జనసందోహంతో ఉండే ఆసుపత్రి ప్రాంగణంలో గాంధీ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు మాత్రమే కనిపిస్తున్నారు. ఇదివరకు ఓపీ విభాగంలో 4వేల మంది వస్తుండేవారు. కరోనా వెలుగు చూశాక... రెండు వేల మంది లోపే వస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇప్పుడు వేరే ఆసుపత్రులకు వెళ్తుండడం వల్ల గాంధీ పరిసరాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి : 'ఇవి పాటిస్తే కరోనాను వంద శాతం అరికట్టవచ్చు'